Hyderabad Lok sabha
-
గెలిచేది మేమే.. ‘హైదరాబాద్’కు న్యాయం చేస్తాం : మాధవీలత
ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చలో నిలిచిన పార్లమెంట్ స్థానం హైదరాబాద్. ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ బలంగా ఉన్న పార్లమెంట్ స్థానం అది. దశాబ్దాలుగా అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రతిసారి అక్కడ ఇతర పార్టీలు నామమాత్రంగా తమ అభ్యర్థులను బరిలో నిలిపేవారు. కానీ ఈ సారి ఈ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీలత చాలా సీరియస్‌గా ప్రచారం చేసింది. పాతబస్తీలోని హిందూవులనంతా ఒక్కతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. బీజేపీ అధిష్టానం కూడా మాధవీలతకు చాలా సపోర్ట్‌గా నిలిచింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆమె గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా అసదుద్దీన్ ఓవైసి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినా.. మాధవీలత మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగరబోతుందని బలంగా చెబుతోంది. ఎన్నికల కౌంటింగ్‌కి కొద్ది గంటల ముందు ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ..‘ఫలితాల కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. బీజేపీ సానుభూతిపరులతో పాటు దేశం మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఫలితంపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మేము(బీజేపీ) గెలిచి హైదరాబాద్‌కు న్యాయం చేస్తాం. రెండు పర్యాయాలు గెలిచిన నరేంద్రమోదీ దేశ అభివృద్ధి కోసం ఎంత కృషి చేశారో అందరికి తెలుసు. దేశం మొత్తం మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ సారి హైదారాబాద్‌తో పాటు 400 స్థానాల్లో బీజేపీ గెలవాలని దేశం మొత్తం కోరుకుంటుంది. అదే జరగబోతుంది’అని మాధవీలత అన్నారు. -
బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది. పోలింగ్ బూత్‌లో ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి.. అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.#WATCH | Telangana: BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha visits a polling booth in the constituency. Voting for the fourth phase of #LokSabhaElections2024 is underway. pic.twitter.com/BlsQXRn80C— ANI (@ANI) May 13, 2024 దీంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మలక్‌పేట్ పోలీసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలిపారు. 171c, 186, 505(1)(c)ఐపిసి, అండ్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. -
‘అసద్‌పై హైదరాబాద్‌లో పోటీ చేస్తా.. అల్లా దయ ఉంటే ఓడించి తీరుతా’
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌పై హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వెల్లడించారు. రాహుల్‌గాంధీని హైదరాబాద్‌లో పోటీ చేయాలని అసదుద్దీన్ సవాల్ చేయడం బేకార్ అని, ఆయనపై పోటీకి తానే వస్తానని వ్యాఖ్యానించారు. పోటీ చేయడమే కాదని, అల్లా దయ ఉంటే ఓడించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ రాహుల్ ఏమన్నారని అసదుద్దీన్ సవాల్ చేశారని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఇచ్చిన నాయకుడిగా ఇక్కడి ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు రాహుల్ వచ్చారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం గాంధీలది. కనీసం మైనార్టీల కోసం కూడా పోరాటం చేయలేని కుటుంబం ఒవైసీలది. కేసీఆర్ ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్ల గురించి ఏరోజైనా అసద్ అడిగారా?’ అని అన్నారు. పాతబస్తీ ముస్లింలు ఎంఐఎం గుండాయిజం చూసి భయపడి బయటకు రావడం లేదు. అసదుద్దీన్‌కు దమ్ముంటే హైదరాబాద్ వదిలి బయటకు రాగలరా’ అని ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీ వచ్చే సమయంలో రాష్ట్రంలో లేకుండా సీఎం కేసీఆర్ ఏ ధైర్యంతో వెళ్లారో చెప్పాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి రాజ్యసభ సభ్యులుగా ఎందుకు అవకాశం ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి’ అని జగ్గారెడ్డి నిలదీశారు. చదవండి: కాంగ్రెస్ ‘రైతు రచ్చబండ’ షురూ -
భాగ్యనగరం మనదే: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్/సైదాబాద్: ‘వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంసహా దాని పరిధిలోని శాసనసభా నియోజకవర్గాలన్నింటినీ బీజేపీ కైవసం చేసుకుంటుంది’అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం మార్పును కోరుకుంటోందని, అది బీజేపీ వల్లే సాధ్యమని నమ్ముతోందని అన్నారు. బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకర్గస్థాయి సమీక్షాసమావేశం ఆదివారం ఇక్కడ చంపాపేటలోని మినర్వా గార్డెన్లో నిర్వహించారు. దొంగ ఓట్లతో ఎంఐఎం గెలుస్తోందని, ఒకవర్గం ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు యత్నిస్తోందని, ఈ విషయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సంజయ్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య రామమందిరం తరహా లో భాగ్యనగరంలో భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తెలంగాణను నయా రజాకార్ల రాజ్యంగా మార్చాయని, ఇక్కడ రజాకార్ల పాలన కావాలో... సుభిక్షంగా ఉండే రామరాజ్యం కావాలో.. ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. దారుస్సలాంను ఆక్రమిస్తాం.. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు 1969లో అప్పటి ఆంధ్రాపాలకులతో నాటి ఎంఐఎం అధినేత రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని, అందులో భాగంగానే దారుస్సలాంను రాయించుకున్నారని సంజయ్ ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే దానిని ఆక్రమించుకుని తీరుతామని స్పష్టం చేశారు. పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలకు తట్టుకోలేక ఒకవర్గం ప్రజలెందరో తమ ఆస్తులను వదిలేసి మూసీ అవతలకు వెళ్లిపోయారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాతబస్తీ నుంచే ఘర్‌వాపసీ మొదలుపెడతామని పేర్కొన్నారు. ‘బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరు. అవసరమైతే, అసెంబ్లీలో పెట్టబోయే బడ్జెట్లో లాఠీలు కొనేందుకు, అరెస్ట్ చేసి లోపల పెట్టేందుకు జైళ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపులు చేసుకోవచ్చు’అని అన్నారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని తెలంగాణ ఐకాన్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ఓటమి ఖాయం : కిషన్‌రెడ్డి ‘సీఎం కేసీఆర్ ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు తిరిగినా, చివరికి పాకిస్తాన్ ప్రధానిని, అక్కడి ఉగ్రవాదులను కలిసినా తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం’అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేదలకు అందకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. -
హైదరాబాద్ @ మజ్లిస్ అడ్డా
సాక్షి, హైదరాబాద్ : దాదాపు 400 సంవత్సరాల ప్రాచీన నగరం హైదరాబాద్ పాతబస్తీ. ఇదే హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం. హిందూ, ముస్లింలు సోదర భావంతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా కనిపిస్తుంటారు. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాల మేనిఫెస్టోలు, ఇతరత్రా ప్రచార అంశాలేవీ ప్రభావం చూపవు. బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలే జెండా ఎగురవేస్తాయి. దీంతో ఇక్కడ పార్టీల కంటే మత రాజకీయాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. ఇక్కడ ముస్లిం సామాజికవర్గం ఓట్లు అధికం. ముస్లిం పక్షాన గళం విప్పే మజ్లిస్ పార్టీకి గట్టి పట్టుంది. ఇక్కడి ప్రజానీకంపై ఆ పార్టీ తనదంటూ చెరగని ముద్ర వేసుకుంది. గత మూడున్నర దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. ఆదిలో కాంగ్రెస్ శకం సాగినప్పటికీ.. ఆ తర్వాత మజ్లిస్ పార్టీ పాగా వేసి తిరుగులేని శక్తిగా ఎదిగింది. దశాబ్దాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో హేమాహేమీలను రంగంలోకి దింపి మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. తొలిదశలో కాంగ్రెస్‌దే హవా.. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. నిజాం పాలన విముక్తి కోసం తెలంగాణ సాయిధ పోరాటానికి సారధ్యం వహించిన ‘కమ్యూనిస్టు పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్’ (పీడీఎఫ్) ఎన్నికల బరిలో దిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముందు నిలవలేక పోయింది. హైదరాబాద్ స్టేట్‌లో లోక్‌సభకు తొలిసారిగా 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నిజాం పాలనలో మంత్రిగా పనిచేసిన అహ్మద్ మోహియిద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ప్రముఖ కమ్యూనిస్టు నేత మగ్దూం మోహియుద్దీన్పై విజయం సాధించారు. తర్వాత 1957లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజతో అహ్మద్ మొహియుద్దీన్ కొత్తగా ఏర్పడ్డ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి మారిపోయారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా వినాయక్‌రావు రంగంలోకి దిగి ఇండిపెండెంట్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన గోపాల్ ఎస్ మెల్కొటే వరుసగా 1962, 1967లో విజయ ఢంకా మోగించారు. 1971లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మెల్కొటే తెలంగాణ ప్రజా సమితి పక్షాన బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ నుంచి కేఎస్ నారాయణ వరుసగా రెండుసార్లు గెలిచారు. 1984 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో పడిపోయి.. క్రమంగా పూర్తిగా ‘హైదరాబాద్’లో వెనుకబడిపోయింది. హైదరా‘బాద్’షా మజ్లిస్ మజ్లిస్ పార్టీకి కంచుకోట హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడి నుంచి మూడున్నర దశాబ్దాలుగా వరుసగా ప్రాతినిథ్యం వహిస్తోంది. మజ్లిస్‌కు ఆదిలో వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ పట్టు వీడకుండా ఎన్నికల బరిలో దిగి పట్టు బిగించి వరస విజయాలు తన ఖాతాలో వేసుకుంటోంది. మొదట్లో మజ్లిస్ పార్టీ ‘స్వతంత్రుల’ పేరుతో ఎన్నికల బరిలో దిగి గట్టిపోటీ ఇచ్చింది. ‘మజ్లిస్ ఇతేహదుల్ ముస్లిమీన్’ (ఎంఐఎం) పార్టీ పునర్నిర్మాణం తర్వాత తొలిసారిగా ఇండిపెండెంట్‌గా బరిలో దిగి పరాజయం పాలైంది. 1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వాహెద్ ఒవైసీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గట్టి పోటీనిచ్చినా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాహెద్ అనంతరం ఆయన కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత పార్టీ పక్షాన మహ్మద్ అమానుల్లా ఖాన్‌ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దింపగా.. ఆయన మూడోస్థానానికే పరిమితమయ్యారు. 80వ దశకంలో టీడీపీ ఆవిర్భావం మజ్లిస్ పార్టీకి కలిసొచ్చింది. 1984లో మజ్లిస్ బోణీ లోక్‌సభకు 1984లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ నుంచి ఇండిపెండెంట్‌గా సుల్తాన్ సలావుద్దీన్ బరిలోకి దిగి తొలిసారి గెలుపు ఖాతా తెరిచారు. అప్పట్లో కొత్తగా ఆవిర్భ వించిన టీడీపీ నుంచి పోటీ చేసిన కె.ప్రభాకర్‌రెడ్డి రెండో స్థానంలోను, కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. తిరిగి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నేరుగా ‘మజ్లిస్ పార్టీ’ పేరుతో ఎన్నికల బరిలో దిగి విజయం సాధించింది. తర్వాత మజ్లిస్ పార్టీ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతిసారి ఎన్నికల్లో అధికార పక్షాలతో చేసుకున్న ఒప్పందాలు కూడా ఆ పార్టీకి కలిసొచ్చాయి. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ వరుసగా ఆరు సార్లు ఎంపీగా ఎన్నికవగా.. తద నంతరం ఆయన వారసుడిగా అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల బరిలోకి దిగి వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆయనే బరిలోకి దిగుతున్నారు. వికసించని ‘కమలం’ హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కమలం హిందుత్వ ఎజెండాతో గట్టిపోటీ ఇస్తున్నా విజయాన్ని మాత్రం చేరుకోలేకపోతోంది. ప్రతిసారి ఎన్నికల్లో హేమా హేమీలను రంగంలోకి దింపి విజయం కోసం శత విధాలా ప్రయత్నిస్తూనే ఉంది. తొలిసారి 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ్ అభ్యర్థిగా ఆలెæ నరేంద్ర బరిలోకి దిగి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చినా విజయాన్ని దక్కించుకోలేకపోయారు. టీడీపీ ఆవిర్భావం అనంతరం మిత్రపక్షం కారణంగా బీజేపీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు. తర్వాత 1991లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బద్దం బాల్‌రెడ్డి కూడా పోటీ ఇచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. 1996లో పార్టీ అగ్రనేత ఎం. వెంకయ్యనాయుడు ఎన్నికల బరిలో దిగినా పరాభవమే ఎదురైంది. తర్వాత వరుసగా రెండుసార్లు తిరిగి బద్దం బాల్‌రెడ్డి పోటీ చేసినా ఓటమే పునరావృతమైంది. బాల్‌రెడ్డి తర్వాత సుభాష్ చంద్రాజీ, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్ భగవంతరావులను ఎన్నికల బరిలోకి దింపినా ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. తాజాగా ప్రస్తుత (2019) లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా భగవంతరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీకి సైతం పరాభవమే.. తెలుగుదేశం పార్టీకి ఆదిలోనే పరాభవం ఎదురైంది. పార్టీ ఆవిర్భావం నుంచి వరసగా రెండు పర్యాయాలు బీజేపీ మద్దతుతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ ‘సైకిల్’కు పరాజయం తప్పలేదు. 1984లో కె. ప్రభాకర్‌రెడ్డి, 1989లో తీగల కృష్ణారెడ్డి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానానంతో సరిపెట్టుకున్నారు. తర్వాత పటోళ్ల ఇంద్రారెడ్డి బరిలోకి దిగి మూడో స్థానంలోకి పడిపోయారు.1996లో తిరిగి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా.. ఆరోస్థానానికి పరిమితమయ్యారు. తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ పక్షాన ‘సియాసత్’ ఉర్దూ పత్రిక ఎడిటర్ జహీద్ అలీఖాన్ గట్టి పోటీ ఇచ్చిన్పపటికీ రెండో స్థానంలోనే ఉండిపోయారు. ఆ తర్వాత టీడీపీ పోటీ ఉనికికే పరిమితమైంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడి నుంచి నామమాత్రపు పోటీతోనే సరిపెట్టుకుంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ‘గులాబీ’ అభ్యర్థి పోటీ చేసినా డిపాజిట్ కోల్పోయాడు. గెలుపు ఓటములు తొలిసారి జరిగిన ఎన్నికల్లో ప్రముఖ కమ్యూనిస్టు నేత మగ్దూం మొహియుద్దీన్ ‘పీడీఎఫ్’ పక్షాన పోటీచేసి ఓటమి పాలయ్యారు. స్వాతంత్య్రం అనంతరం మజ్లిస్ పార్టీ పగ్గాలు చేపట్టిన అబ్దుల్ వాహేద్ ఓవైసీ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి గట్టి పోటీ ఇచ్చినా విజయం కాంగ్రెస్‌నే వరించింది. జీఎస్ మెల్కోటే హ్యాట్రిక్ సాధించారు. రెండుసార్లు కాంగ్రెస్ పక్షాన, ఒకసారి తెలంగాణ ప్రజా సమితి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పక్షాన కేఎస్ నారాయణ రెండుసార్లు విజయం సాధించారు. మజ్లిస్ పార్టీకి చెందిన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఒకసారి ఓటమి పాలైనా తర్వాత వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. ఒకసారి ఇండిపెండెంట్‌గా, ఐదుసార్లు మజ్లిస్ పక్షాన ఎన్నికయ్యారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వరసగా మూడు సార్లు ఎన్నికై హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగారు. బీజేపీ పక్షాన బద్దం బాల్‌రెడ్డి మూడు పర్యా యాలు, ఆలె నరేంద్ర, ఎం.వెంకయ్య నాయుడు ఒక్కోసారి పోటీచేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఒకసారి ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. విజయం.. ఏ పార్టీ ఎన్నిసార్లు.. కాంగ్రెస్ : 06 టీపీఎస్ : 01 మజ్లిస్ : 09 తొలి ఎంపీ : అహ్మద్ మొహియుద్దీన్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ : అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుత రిజర్వేషన్ : జనరల్ హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు.. చార్మినార్ చాంద్రాయణగుట్ట యాకుత్‌పురా బహదూర్‌పురా కార్వాన్ మలక్‌పేట గోషామహల్ -
ఏపార్టీతో పొత్తు పెట్టుకోలేదు: ఓవైసీ
-
ఏపార్టీతో పొత్తు పెట్టుకోలేదు: ఓవైసీ
హైదరాబాద్: అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని మజ్లీస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లీమీన్(ఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోకసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఒంటిరిగానే పోటి చేస్తున్నాం అని ఓవైసీ తెలిపారు. ఎంఐఎంతో జత కట్టేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఆసక్తి చూపుతున్నాయని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటికే ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంఐఎం ఖరారు చేసింది. ఇద్దరు కొత్త అభ్యర్థులకు ఎంఐఎం చోటు కల్పించింది. రానున్న ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో అభ్యర్థులను నిలబెడుతామని ఓవైసీ తెలిపారు. హైదరాబాద్ లోకసభ స్థానంలో హ్యట్రిక్ విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నారు. నగరాభివృద్దే ప్రధాన ఎజెండా అని ఆయన అన్నారు. హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రాంత ప్రజలకు భద్రత కల్పిస్తామని ఓవైసీ భరోసా ఇచ్చారు. 1984 నుంచి ఎంఐఎం హైదరాబాద్ లోకసభ స్థానంలో విజయం సాధిస్తోంది. -
ఓవైసీపై పోటీ చేయడం లేదు: రాంగోపాల్ వర్మ
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ పై పోటీ చేయడం లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేయనున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను వర్మ ఖండించారు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో ఓవైసీల హవాకు గండి కొట్టేందుకు శివసేన తరపున వర్మను బీజేపీ బరిలోకి దింపుతోందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. Reports suggesting that I am contesting against Asaduddin Owaisi are false— Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2014 'చిరంజీవి హటావో, దేశ్ కో బచావో' అంటూ వర్మ చేసిన ట్వీట్ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి బలానిచ్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా వర్మ బహిరంగంగా మద్దతు తెలుపడం, ప్రస్తుత రాజకీయాలపై వేగంగా స్పందించడంతో రాజకీయాల్లోకి ప్రవేశేసిస్తున్నారా అనే సందేహాలు కలిగాయి. అయితే ఓవైసీపై పోటికి దిగడం లేదని చేసిన ట్విట్ కొంత గందరగోళాన్ని తగ్గుముఖం పట్టించే అవకాశం ఉంది.