బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు | Lok Sabha Elections 2024: Case Filed On Hyderabad BJP Candidate Madhavi Latha In Malakpet, Know Reason Inside | Sakshi
Sakshi News home page

బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు

May 13 2024 2:19 PM | Updated on May 13 2024 3:44 PM

case filed on hyderabad bjp candidate madhavi latha in malakpet

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది. పోలింగ్‌ బూత్‌లో ముస్లిం మహిళల హిజాబ్‌ తొలగించి.. అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

 

 

దీంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మలక్‌పేట్‌ పోలీసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలిపారు. 171c, 186, 505(1)(c)ఐపిసి, అండ్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో మధ్యాహ్నం  3 గంటల వరకు 52 శాతం పోలింగ్‌ నమోదైంది.  

Advertisement
 
Advertisement
Advertisement