ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
కడప: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఢిల్లీ, జైపూర్, కాన్పూర్‌లకు చెందిన వీరిని అరెస్ట్ చేయడంతో పాటు పది కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్లు దుబాయ్‌కు చెందిన అలీబాయ్ అనే బడా స్మగ్లర్ అనుచరులని పోలీసులు తెలిపారు.