నష్ట పరిహారంపై ఆర్డీవో నిలదీత | RDO Blackout in vizag | Sakshi
Sakshi News home page

నష్ట పరిహారంపై ఆర్డీవో నిలదీత

Nov 19 2015 6:05 PM | Updated on Sep 3 2017 12:43 PM

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విశాఖపట్నం: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తంతడి గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న బాబా ఆటమిక్ రీసెర్చి సెంటర్(బార్క్)కు సేకరించిన స్థలానికి పరిహారం చెల్లించే విషయమై వివాదానికి దారి తీసింది.

ఆర్డీవో పద్మావతి గ్రామస్తులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థల పరిహారం జాబితాలో అనర్హుల పేర్లను చేర్చారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం నిర్ణయించడంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆర్డీవోను గ్రామస్థులు నిలదీశారు. స్పందించిన ఆర్డీవో...దీనిపై విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement