హీరో రవితేజ సోదరుడు అరెస్టు | Ravi teja brother arrested | Sakshi
Sakshi News home page

హీరో రవితేజ సోదరుడు అరెస్టు

Mar 5 2014 1:17 AM | Updated on Sep 2 2017 4:21 AM

హీరో రవితేజ సోదరుడు అరెస్టు

హీరో రవితేజ సోదరుడు అరెస్టు

రోడ్డుపై కారు నిలపవద్దని కోరిన మాదాపూర్ పోలీసులను హీరో రవితేజ సోదరుడు భరత్‌రాజు భూపతి దుర్భాషలాడారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: రోడ్డుపై కారు నిలపవద్దని కోరిన మాదాపూర్ పోలీసులను హీరో రవితేజ సోదరుడు భరత్‌రాజు భూపతి దుర్భాషలాడారు. దీంతో ఆయనను అరెస్టు చేసినట్టు మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ కె.నర్సింహులు మంగళవారం తెలిపారు.. సోమవారం రాత్రి 12.30 గంటల సమయంలో మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో రోడ్డుపై రెండు కార్లు నిలిపివున్నాయి.
 
 అవతలి కారులో ఉన్న మాజీ భార్యతో భరత్‌రాజు భూపతి మాట్లాడుతున్నారు. బీట్ కానిస్టేబుల్ ప్రతాప్, హోంగార్డు కిష్టయ్య రోడ్డుకు అడ్డంగా ఉన్న కార్లను పక్కకు తీయాలని కోరారు. మద్యం మత్తులో ఉన్న భూపతి ఇరువురినీ దూషించాడు. దీంతో పోలీసులు భూపతిని వైద్యపరీక్షలకు తరలించారు. ఆయనపై కేసు నమోదు చేసి మంగళవారం మియాపూర్‌లోని 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. భూపతికి మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement