హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడుగా రవిప్రసాద్‌ 

Ravi Prasad as chairman of the High Court Advocates Association - Sakshi

ఉపాధ్యక్షుడుగా జీవీఎల్‌.. కార్యదర్శులుగా జేయూఎంవీ, పీటా  

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడుగా సీనియర్‌ న్యాయ వాది వై.వి.రవిప్రసాద్‌ ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో బరిలో దిగిన రవిప్రసాద్‌ తన సమీప ప్రత్యర్థి గూడపాటి వెంకటేశ్వరరావుపై 156 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రవిప్రసాద్‌కు 621 ఓట్లు రాగా, వెంకటేశ్వరరావుకు 465 ఓట్లు వచ్చాయి. అధ్యక్ష స్థానానికి పోటీపడిన మరో అభ్యర్థి జాగర్లమూడి కోటేశ్వరిదేవికి కేవలం 60 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా జీవీఎల్‌ నాగేశ్వరరావు గెలుపొందారు.

ఆయన తన సమీప ప్రత్యర్థి ఎలీషాపై 304 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక రెండు కార్యదర్శుల పోస్టులకు జేయూఎంవీ ప్రసాద్, పీటా రామన్‌ ఎన్నికయ్యారు. సం యుక్త కార్యదర్శిగా ఈర్ల సతీష్‌కుమార్, కోశాధికారిగా తోట సునీత విజయం సాధించారు. వీ రితో పాటు మరికొందరు కార్యవర్గ సభ్యులుగా విజయం సాధించారు. గురువారం 10.30 గంటలకు మొదలైన ఓటింగ్‌ సాయం త్రం వర కు జరిగింది. ఏపీ హైకోర్టు ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top