గుంటూరులో రష్మీ సందడి | Rashmi Gautam In Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో రష్మీ సందడి

Jun 4 2018 1:22 PM | Updated on Aug 24 2018 2:36 PM

Rashmi Gautam In Guntur - Sakshi

జ్యోతిప్రజ్వలన చేస్తున్న రష్మీ

ఎస్‌వీఎన్‌ కాలనీ(గుంటూరు): జబర్ధస్త్‌ యాంకర్, హీరోయిన్‌ రష్మీ ఆదివారం గుంటూరులో సందడి చేశారు. పట్టాభిపురం ప్రధాన కూడలిలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రీట్రెండ్స్‌ సెలూన్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రష్మీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలు, పురుషులు అందానికి తగిన ప్రాధాన్యమివ్వడం మంచి పరిణామమన్నారు. జబర్ధస్త్‌ షోతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. మంచి పాత్రలుదొరికితే సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేవీన్‌కేర్‌ గ్రీన్‌ట్రెండ్స్‌ పట్టాభిపురం ఫ్రాంచేజీ అధినేత సైనిక నేతాజీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement