వారికి లక్షల కోట్లు కట్టబెడుతున్నారు | ramachandra kuntiya about notes cancellation | Sakshi
Sakshi News home page

వారికి లక్షల కోట్లు కట్టబెడుతున్నారు

Dec 24 2016 12:48 AM | Updated on Aug 24 2018 2:17 PM

వారికి లక్షల కోట్లు కట్టబెడుతున్నారు - Sakshi

వారికి లక్షల కోట్లు కట్టబెడుతున్నారు

నగదు రహిత లావాదేవీలు చేసే పేదలపై ట్యాక్స్‌లు వేసి ఆ మొత్తాన్ని ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితంగా ఉండే అంబానీ, అదానీ కంపెనీలకు లక్షల కోట్లు సునాయాసంగా కట్టబెట్టే ప్రయత్నం

‘చలో వెలగపూడి’లో ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ఆరోపణ
సాక్షి, అమరావతి: నగదు రహిత లావాదేవీలు చేసే పేదలపై ట్యాక్స్‌లు వేసి ఆ మొత్తాన్ని ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితంగా ఉండే అంబానీ, అదానీ కంపెనీలకు లక్షల కోట్లు సునాయాసంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్ చార్జి రామచంద్ర కుంతియా ధ్వజమెత్తారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం చలో వెలగపూడి (సచివాలయం) కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉన్న ఫళంగా పెద్దనోట్లు రద్దు చేయడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో పనిలో పనిగా రూ.కోట్ల విలువ చేసే నకిలీ నోట్లను బీజేపీ, టీడీపీ నేతలు బ్యాంకుల్లో మార్చుకున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement