ఎన్టీపీసీకి కేంద్ర పర్యావరణ శాఖ షాక్ | pudimadaka NTPC to move to another Area | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీకి పర్యావరణ శాఖ షాక్

Jan 14 2015 12:14 PM | Updated on Sep 2 2017 7:43 PM

విశాఖ జిల్లా పూడిమడక విద్యుత్ కేంద్రాన్ని మరో ప్రాంతానికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

విశాఖ: విశాఖ జిల్లా పూడిమడక విద్యుత్ కేంద్రాన్ని మరో ప్రాంతానికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పూడిమడక అనుకూలం కాదని  అభ్యంతరం వ్యక్తం చేస్తూ పర్యావరణశాఖ నివేదిక సమర్పించింది. పూడిమడక సునామీ బారిన పడే ప్రాంతం అని పర్యావరణ శాఖ హెచ్చరించింది. పర్యావరణ శాఖ నివేదిక మేరకు విద్యుత్ కేంద్రం మార్పుపై  కేంద్రం చర్యలు చేపట్టింది.  పూడిమడకలో 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి ఎన్టీపీసీ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement