రైతుల సమస్యలపై జిల్లాల్లో చేపట్టిన ధర్నాలు విజయవంతమయ్యాయని వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు.
హైదరాబాద్: రైతుల సమస్యలపై జిల్లాల్లో చేపట్టిన ధర్నాలు విజయవంతమయ్యాయని వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. విశాఖలో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం దారుణం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటుకు కోట్లు కేసులో దొరికిన చంద్రబాబునాయుడు కేసీఆర్తో రాజీకోసం కృష్ణా జలాలపై హక్కులను వదిలేశారని ఆరోపించారు. టీఎస్ సర్కార్ తో కుమ్మక్కూ కృష్ణా బోర్డు వద్ద కిమ్మనకుండా ఊరుకున్నారని అన్నారు. చంద్రబాబు కేసు కోసం ప్రజల ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫణంగా పెట్టొద్దని హితవు పలికారు.