సచివాలయ పరిధిలో నిషేధాజ్ఞలు | Prohibited to hold any kind of public meetings, says anurag sharma | Sakshi
Sakshi News home page

సచివాలయ పరిధిలో నిషేధాజ్ఞలు

Sep 19 2013 12:41 AM | Updated on Sep 1 2017 10:50 PM

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సచివాలయానికి చుట్టూ 500 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సచివాలయానికి చుట్టూ 500 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం 6 నుంచి నవంబర్ 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

ఈ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభల నిర్వహణ, నలుగురికంటే ఎక్కువ మంది ఓ చోట గుమిగూడటం, నిషేధ వస్తువులతోపాటు కర్రలు తదితరాలు కలిగి ఉండటం, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించడం, ఉపన్యాసాలు ఇవ్వడం, నినాదాలు చేయడం, ఊరేగింపులు నిర్వహించడం, ధర్నాలు, పికెటింగ్‌లు.. వంటివి నిషిద్ధం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement