
సాక్షి, సింహాచలం(పెందుర్తి): సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం పాము కలకలం సృష్టించింది. సింహగిరి వంటశాల నుంచి ఆలయ ప్రాంగణం వైపు వస్తున్న పామును కొందరు సిబ్బంది చూసి ఆందోళన చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆలయ ఉప ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు ఆ పామును పట్టుకుని దూరంగా తోటల్లో విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.