నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ప్రణబ్ రాక | Pranab Mukherjee to visit Hyderabad today | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ప్రణబ్ రాక

Nov 4 2013 1:31 AM | Updated on Sep 4 2018 5:07 PM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం హైదరాబాద్ రానున్నారు.

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం హైదరాబాద్ రానున్నారు. రాత్రి 7.35 గంటలకు రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సోమవారం రాత్రి పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రతి నిధులు రాష్ట్రపతిని కలవనున్నారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఆయా పార్టీల ప్రతినిధులకు ఆయన అపాయింట్‌మెంట్ ఇచ్చారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరిగే శిక్షణ పూర్తి చేసుకున్న 2012 ఐపీఎస్ బ్యాచ్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement