నేడు అనంతపురానికి రాష్ట్రపతి | pranab mukherjee to visit anantapur district today | Sakshi
Sakshi News home page

నేడు అనంతపురానికి రాష్ట్రపతి

Dec 23 2013 1:45 AM | Updated on Jun 1 2018 8:39 PM

నేడు అనంతపురానికి రాష్ట్రపతి - Sakshi

నేడు అనంతపురానికి రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతోపాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.

* నీలం శతజయంతి వేడుకలకు హాజరు
* గవర్నర్, ముఖ్యమంత్రి కూడా..
 
సాక్షి, హైదరాబాద్/అనంతపురం: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతోపాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం 10.35 గంటలకు రాష్ట్రపతితో కలసి ప్రత్యేక విమానంలో గవర్నర్, సీఎం హైదరాబాద్ నుంచి బయల్దేరుతారు. 11.30 గంటలకు పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచీ హెలికాప్టర్‌లో అనంతపురం చేరుకుంటారు.

12.30 గంటలకు నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరిగే నీలం శతజయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటా రు. మధ్యాహ్నం 1.50 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి పుట్టపర్తి చేరుకుంటారు. 2.35 గంటలకు సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. 3 గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతితో కలసి గవర్నర్, సీఎం హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. ఈ పర్యటనలో మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొననున్నారు. ప్రణబ్ రాక నేపథ్యంలో అనంతపురం, పుట్టపర్తిలలో భద్రత కట్టుదిట్టం చేశారు. డీజీపీ ప్రసాదరావు దగ్గరుండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రపతితో గవర్నర్ భేటీ
రాష్ట్రపతిని గవర్నర్ నరసింహన్ ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశారు. రాష్ట్రపతి హైదరాబాద్‌లో బసచేస్తున్నందున మ ర్యాదపూర్వకంగా కలిశారని రాజ్‌భవన్‌వర్గాలు తెలిపాయి.

రాష్ట్రపతిని కలసిన సీఎం కిరణ్
రాష్ట్రపతిని సీఎం కిరణ్ కూడా కలిశారు. ఈ భేటీ పావుగంటపాటు కొనసాగింది. సీఎం వుర్యాదపూర్వకంగానే కలిశారని, ఇందులో మరేఇతర ప్రాధాన్యం లేదని సీఎంవో వర్గాలు చెప్పాయి. అరుుతే రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరుణంలో.. ఈ అంశాన్ని సీఎం రాష్ట్రపతితో ప్రస్తావించి ఉండవచ్చంటున్నారు. బిల్లులోని కొన్ని అస్పష్ట అంశాల్ని కూడా ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లి ఉండొచ్చంటున్నారు. టీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ, సీవూంధ్ర ప్రాంత వునోభావాలెలా ఉన్నాయున్న అంశాలనూ వివరించినట్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement