విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి అధికారులు కోతలు అమలు చేయనున్నారు.
నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి అధికారులు కోతలు అమలు చేయనున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, పట్టణాల్లో ఉదయం 8 నుంచి 10 వరకు, సాయంత్రం 2 నుంచి 4 గంటల వరకు కోత విధించనున్నారు. మండలాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోతలు విధించనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అంటే 12 గంటల పాటు కోతలు అమలు చేయనున్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరగడంతో కోతలు విధిస్తున్న సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లాకు రోజుకు 85 లక్షల యూనిట్లు కోటాగా నిర్ణయించారు. ప్రస్తుతం రోజుకు 90 లక్షల యూనిట్లు ఖర్చు అవుతోం ది. అంతే గాక వ్యవసాయానికి ఏడు గంటల పాటు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విధించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.