
భద్రత కట్టుదిట్టం
నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌కు పోలీస్ భద్రత కట్టుదిట్టం చేశారు.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌కు పోలీస్ భద్రత కట్టుదిట్టం చేశారు. కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లా, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించారు. దాదాపు 40 మందిడీఎస్పీలు, 150 మంది సీఐలు, 350 మంది ఏఆర్ సిబ్బంది, 20 ప్లటూన్ల ఏపీఎస్పీ, 8 ప్లటూన్ల కేంద్ర బలగాలతో పాటు 50 స్పెషల్‌పార్టీ బృందాలను బందోబస్తు విధులకు వినియోగిస్తున్నారు. పోలీసు శాఖ తరఫున ఎన్నికల అబ్జర్వర్‌గా డేవిడ్‌సన్‌ను నియమించారు.
రాయలసీమ ఐజీ షేక్ మహమ్మద్ ఇక్బాల్, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్పీ గోపినాథ్ జట్టి నంద్యాలలోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నంద్యాల టౌన్ ఇన్‌చార్జ్‌గా చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు, నంద్యాల రూరల్ ఇన్‌చార్జ్‌గా విశాఖపట్టణం ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, గోస్పాడ్ ఇన్‌చార్జ్‌గా ప్రకాశం ఎస్పీ సత్య ఏసుబాబుకు బాధ్యతలు అప్పగించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా కోసం వీడియో, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.