గుంటూరు క్రైం : రాత్రనక, పగలనక అహర్నిశలు ప్రజా సేవలో నిమగ్నమై విధి నిర్వహణలో తలమునకలవుతున్న పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని గతంలో పనిచేసిన ఎస్పీలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు క్రైం : రాత్రనక, పగలనక అహర్నిశలు ప్రజా సేవలో నిమగ్నమై విధి నిర్వహణలో తలమునకలవుతున్న పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని గతంలో పనిచేసిన ఎస్పీలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీక్లీ ఆఫ్ అమలులోకి రావడంతో అప్పటివరకు అనేక రకాల మానసిక ఒత్తిళ్లకు గురైన సిబ్బందికి కొంతమేరకు ఊరట కలిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ విధానాన్ని కొద్దిరోజులు మాత్రమే అమలు పరిచారు. తర్వాత క్రమేపీ ఆ విధానానికి అధికారులు కొంద రు స్వస్తి పలికారు. గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బం దికి రోస్టర్ విధానంలో వీక్లీ ఆఫ్‌ను కేటాయించారు.
ఈ విధానం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. అమల్లోకి వచ్చిన కొద్ది నెలలకే సిబ్బంది కొరత, తదితర సమస్యల కారణంగా వీక్లీ ఆఫ్ విధానానికి అధికారులు స్వస్తి పలికారు. రూరల్ జిల్లా పరిధిలోని కొద్ది పోలీస్ స్టేషన్‌లలో మాత్రమే ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ కారణంగా మళ్లీ కొద్ది నెలల నుంచి సెలవులు లేక, అధికారుల ఆదేశాలను కాదనలేక కొట్టుమిట్టాడుతూ విధులు నిర్వహించాల్సి వస్తుందని పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం విధి నిర్వహణలో మానసిక ప్రశాంతతను కోల్పోవడంతో పాటు ,కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం తో ప్రాణాలను పణంగా పెట్టి విధు లు నిర్వహించాల్సి వస్తుంద ని, సిబ్బంది సమస్యలను గుర్తించి వీక్లీ ఆఫ్ విధానాన్ని పునరుద్ధరించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు.