సీఎం వైఎస్‌ జగన్‌ భద్రత ఇలాగేనా? | Police Negligence In AP CM YS Jagan Security | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి భద్రత ఇలాగేనా?

Jun 15 2019 8:06 AM | Updated on Jun 15 2019 8:16 AM

Police Negligence In AP CM YS Jagan Security  - Sakshi

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని వందేమాతరం హైస్కూల్‌లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు.  అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి బయల్దేరారు. సీఎం కాన్వాయ్‌ పెనుమాక నుంచి ఉండవల్లి సెంటర్‌ మీదుగా తాడేపల్లి వైపుకు వస్తున్న సమయంలో ఉండవల్లి సెంటర్‌ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లే వాహనాలను ఒక్కసారిగా వదిలేశారు. దీంతో అతి తక్కువ వ్యవధిలో పదుల సంఖ్యలో వాహనాలు సీఎం కాన్వాయ్‌లో కలిసిపోయాయి. ఇలా, సీఎం ప్రయాణించే మార్గంలో ఇతర వాహనాలను అనుమతించడం ఆయన భద్రతకు ముప్పని పోలీస్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement