వ్యక్తి అనుమానాస్పద మృతి | Police investigating suspicious death at everest lodge in nellore | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Sep 15 2015 2:39 PM | Updated on Sep 3 2017 9:27 AM

నెల్లూరులోని ఓ లాడ్జిలో ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

నెల్లూరు క్రైమ్: నెల్లూరులోని ఓ లాడ్జిలో ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు.  ప్రాథమిక సమాచారం మేరకు.. జిల్లాలోని ఇందుకూరిపేట మండలం జగదేవిపేటకు చెందిన అత్తులూరి ప్రభాకర్ నాయుడు (55) ఎవరెస్ట్ లాడ్జిలో ఈ నెల 2న ఓ గది అద్దెకు తీసుకున్నాడు. అయితే, సోమవారం నుంచి అతడుంటున్న గది తలుపు తెరచుకోలేదు. అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది మంగళారం తలుపులు తెరచి చూడగా ప్రభాకర్ నాయుడు మృతి చెంది ఉన్నాడు.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement