విచారణ పేరుతో పోలీసులు హింసిస్తున్నారు! | police harrsed by investigation! | Sakshi
Sakshi News home page

విచారణ పేరుతో పోలీసులు హింసిస్తున్నారు!

Nov 24 2014 1:13 PM | Updated on Aug 21 2018 5:46 PM

తమ కుమార్తె అదృశ్యం కేసులో పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆ బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు.

విజయవాడ: తమ కుమార్తె అదృశ్యం కేసులో పోలీసులు హింసిస్తున్నారని కావ్య తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ కుమార్తె అదృశ్యం కేసులో దర్యాప్తు ముందుకు సాగక పోగా,  తమను పదే పదే విచారిస్తూ వేధిస్తున్నారని వారు స్పష్టం చేశారు. ఆ కేసులో తదుపరి విచారణను ప్రక్కకు పెట్టిన పోలీసులు.. కుటుంబ సభ్యులనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్నారు.

 

పాప ఆచూకీ కనిపెట్టడం మాని తమనే విచారించడం ఎంతవరకు సమంజసమని మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. కేసు పెట్టడమే తప్పయిందని పోలీస్ శాఖపై అసహనం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement