అంతరాష్ట్ర దొంగల నుంచి కోటిన్నర విలువైన కార్లు స్వాధీనం | Police bust interstate gangs in anantapur district and guntur district | Sakshi
Sakshi News home page

అంతరాష్ట్ర దొంగల నుంచి కోటిన్నర విలువైన కార్లు స్వాధీనం

Oct 13 2013 11:23 AM | Updated on Aug 24 2018 2:33 PM

అనంతపురంలో ఈ రోజు ఉదయం అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన నలుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు నగర డీఎస్పీ దయానందరెడ్డి ఆదివారం వెల్లడించారు.

అనంతపురంలో ఈ రోజు ఉదయం అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన నలుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు నగర డీఎస్పీ దయానందరెడ్డి ఆదివారం వెల్లడించారు. వారి వద్ద నుంచి కోటిన్నర విలువైన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ముఠాకు చెందిన మరో ఏడుగురు సభ్యులు తప్పించుకున్నారని చెప్పారు.

 

దొంగలను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే గుంటూరు జిల్లాలోని తెనాలిలో మరో అంతరాష్ట్ర దోపిడికి చెందిన ఇద్దరు దొంగలను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.70 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement