ప్రకృతి సోయగాల కొలువు కోనాం | Picnic Spot Konam Reservoir Visakhapatnam | Sakshi
Sakshi News home page

ప్రకృతి సోయగాల కొలువు కోనాం

Nov 23 2018 7:48 AM | Updated on Jan 3 2019 12:14 PM

Picnic Spot Konam Reservoir Visakhapatnam - Sakshi

అందమైన కోనాం జలాయం గేట్లు,గట్టు


విశాఖపట్నం, చీడికాడ (మాడుగుల): పిక్నిక్‌లకు కోనాం జలా శయం పరిసరాలు పచ్చని కొండల మధ్య స్వర్గధామంగా విలసిల్లుతోంది. కార్తీకమాసం సందర్భంగా పెద్దఎత్తున సందర్శకులు ఇక్కడికి తరలివస్తున్నారు. జలాశయం పరిసరాల్లో జీడితోటలు,సెలయేళ్లు కనువిందు చేస్తాయి. చోడవరం నుంచి 16 కిలోమీటర్లు దూరంలో కోనాం జలాశయం ఉంది. కోనాం చేరు కోవాలంటే చోడవరం నుంచి ప్రతి ఉదయం,మధ్యా హ్నం, సాయంత్రం బస్‌ సర్వీసులు ఉన్నాయి. అలా కాకుండా ప్రతి రోజు  ఆటోలు తిరుగుతుంటాయి. జలాశయం దిగువ భాగం నుంచి అయినాడ, ఈదులపాలెం పై నుంచి 12వ మైలురాయి వెళ్లేందుకు కాజ్‌వేపై నుంచి నూతనంగా నిర్మించిన తారురోడ్డు వెంట ప్రయణం పాడేరు, అరుకు రూట్‌ను తలపిస్తుంది.

ప్రస్తుతం జీపు,ఆటోలు,ద్విచక్ర వాహానాలు వెల్లేందుకు మార్గంను పునురుద్ధరించారు. దీంతో జలాశయం అవతల ఉన్నగిరిజన గ్రామాలకు వెళ్లే   కొండల నడుమ ఈ మార్గం సాగుతుంది. ఇక్కడి ప్రకృతి అందాలు మనసును కట్టిపడేస్తాయి.  కోనాం గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల పక్క నుంచి చెరుకు పల్లి వెళ్లే మార్గం జలాశయం అంచు నుంచి సాగుతుంది. ఈ మార్గంలోనే జలాశయంలోకి నీరునింపే బోడ్డేరు ప్రవహిస్తుంది. దీనిని ఆనుకుని పర్యాటకులు కుర్చునేందుకు, వంటలు చేసుకునేందుకు నీరు, జీడి మామిడి తోటలు వసతులుగా నిలిస్తున్నాయి.  గుడివాడ వెళ్లే దారి పొడవునా గల చిన్న,చిన్నఎర్ర మట్టి దిబ్బలు, కొండల నడుమ నడకసాగిస్తే ఏదో లోకంలో విహరిస్తున్న అనుభూతి  కలుగుతుం ది.

జలాశయం గర్భం గండా కాకుల గెడ్డ, పెద్ద గెడ్డ పారే రాతి పనుకుల వద్దకు చేరుకుంటే వసతులతో పాటు రాతి పనుకుల మధ్యనుంచి పారే సెలయేర్లు  మరుపురానిఅనుభూతినిస్తాయి.ఇక్కడికి రోడ్డు, నా టు బోటులపై వెళ్లే అవకాశం ఉంది. స్థానిక మత్స్య కారులు పర్యాటకుల కోసం జలాశయం వద్ద అందుబాటులో ఉంటారు. ఉదయం, సాయం సంధ్య వేళల్లో బోటు షికారు ఆహ్లాదకరంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement