breaking news
Konam reservoir
-
ప్రకృతి సోయగాల కొలువు కోనాం
విశాఖపట్నం, చీడికాడ (మాడుగుల): పిక్నిక్లకు కోనాం జలా శయం పరిసరాలు పచ్చని కొండల మధ్య స్వర్గధామంగా విలసిల్లుతోంది. కార్తీకమాసం సందర్భంగా పెద్దఎత్తున సందర్శకులు ఇక్కడికి తరలివస్తున్నారు. జలాశయం పరిసరాల్లో జీడితోటలు,సెలయేళ్లు కనువిందు చేస్తాయి. చోడవరం నుంచి 16 కిలోమీటర్లు దూరంలో కోనాం జలాశయం ఉంది. కోనాం చేరు కోవాలంటే చోడవరం నుంచి ప్రతి ఉదయం,మధ్యా హ్నం, సాయంత్రం బస్ సర్వీసులు ఉన్నాయి. అలా కాకుండా ప్రతి రోజు ఆటోలు తిరుగుతుంటాయి. జలాశయం దిగువ భాగం నుంచి అయినాడ, ఈదులపాలెం పై నుంచి 12వ మైలురాయి వెళ్లేందుకు కాజ్‌వేపై నుంచి నూతనంగా నిర్మించిన తారురోడ్డు వెంట ప్రయణం పాడేరు, అరుకు రూట్‌ను తలపిస్తుంది. ప్రస్తుతం జీపు,ఆటోలు,ద్విచక్ర వాహానాలు వెల్లేందుకు మార్గంను పునురుద్ధరించారు. దీంతో జలాశయం అవతల ఉన్నగిరిజన గ్రామాలకు వెళ్లే కొండల నడుమ ఈ మార్గం సాగుతుంది. ఇక్కడి ప్రకృతి అందాలు మనసును కట్టిపడేస్తాయి. కోనాం గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల పక్క నుంచి చెరుకు పల్లి వెళ్లే మార్గం జలాశయం అంచు నుంచి సాగుతుంది. ఈ మార్గంలోనే జలాశయంలోకి నీరునింపే బోడ్డేరు ప్రవహిస్తుంది. దీనిని ఆనుకుని పర్యాటకులు కుర్చునేందుకు, వంటలు చేసుకునేందుకు నీరు, జీడి మామిడి తోటలు వసతులుగా నిలిస్తున్నాయి. గుడివాడ వెళ్లే దారి పొడవునా గల చిన్న,చిన్నఎర్ర మట్టి దిబ్బలు, కొండల నడుమ నడకసాగిస్తే ఏదో లోకంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుం ది. జలాశయం గర్భం గండా కాకుల గెడ్డ, పెద్ద గెడ్డ పారే రాతి పనుకుల వద్దకు చేరుకుంటే వసతులతో పాటు రాతి పనుకుల మధ్యనుంచి పారే సెలయేర్లు మరుపురానిఅనుభూతినిస్తాయి.ఇక్కడికి రోడ్డు, నా టు బోటులపై వెళ్లే అవకాశం ఉంది. స్థానిక మత్స్య కారులు పర్యాటకుల కోసం జలాశయం వద్ద అందుబాటులో ఉంటారు. ఉదయం, సాయం సంధ్య వేళల్లో బోటు షికారు ఆహ్లాదకరంగా ఉంటుంది. -
ప్రమాదస్థాయికి జలాశయాలు
2వేల క్యూసెక్కుల నీరు వివిధ నదుల్లోకి విడుదల పొంగి ప్రవహిస్తున్న శారద,పెద్దేరు,బొడ్డేరు చోడవరం : పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వచ్చిపడుతోంది. ఒక్కసారిగా జిల్లాలోని రైవాడ, కోనాం, పెద్దేరు, కల్యాణపులోవ రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరాయి. దీంతో అన్నింటి గేట్లు ఎత్తి వందలాది క్యూసెక్కుల నీటిని నదుల్లోకి విడిచిపెడుతున్నారు. పాలగెడ్డ, గొర్లెగెడ్డ, ఉరకగెడ్డ, తారకరామ,గుండుబాడు మినీ రిజర్వాయర్లలోనూ వరద నీరు ఉరకలు వేస్తోంది. శనివారం రైవాడ జలాశయం మూడు గేట్లు ఎత్తి 800క్యూసెక్కుల నీటిని శారదానదిలోకి వదిలారు. శారదానది పొంగి ప్రవహిస్తోంది. కల్యాణపులోవ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల నీరు, కోనాం జలాశయం ఒక గేటు ఎత్తి 500 క్యూసెక్కులు బొడ్డేరు నదిలోకి,పెద్దేరు రెండు గేట్లు ఎత్తి 500క్యూసెక్కులు నీరు పెద్దేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. శారద,పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదులు నీటితో కళకళలాడుతున్నాయి. రిజర్వాయర్ల పరిధిలో సుమారు లక్ష ఎకరాల సాగు భూమి ఉంది. ఈ ఖరీఫ్‌కు నీటి ఇబ్బందులు ఉండవని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.