పీజీ ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ | PG Admissions Web Counseling | Sakshi
Sakshi News home page

పీజీ ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్

Jun 8 2014 3:01 AM | Updated on Sep 2 2018 4:48 PM

పీజీ ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ - Sakshi

పీజీ ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్

పీజీ ప్రవేశాలకు సైతం ఈ సారి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. గతంలో ప్రవేశాలను ఆంధ్రా యూనివర్సిటీలో నేరుగా కౌన్సెలింగ్ నిర్వహించేవారు. అయితే ఈసారి ఆసెట్-2014కు సంబంధించి

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: పీజీ ప్రవేశాలకు సైతం ఈ సారి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. గతంలో ప్రవేశాలను ఆంధ్రా యూనివర్సిటీలో నేరుగా కౌన్సెలింగ్  నిర్వహించేవారు. అయితే ఈసారి ఆసెట్-2014కు సంబంధించి (ఆంధ్రా యూనివ ర్సిటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ) పీజీ ప్రవేశాలకు మొదటి సారిగా వె బ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఎంసెట్, ఎడ్ సెట్, ఐసెట్ మాదిరిగా విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన అనంతరం వర్సిటీ, ఏఫిలియేషన్ కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుం ది. ఈ విధానంతో జిల్లా విద్యార్థులు ఇకపై కౌన్సెలింగ్‌కు విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేదు. లభించిన  సీటు ఆధారంగా అలాట్‌మెంట్ అయిన కళాశాలలకు వెళితే సరిపడుతుంది. ఇందులో భాగంగా ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడల్లో  నాలుగు చోట్ల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ విభాగంలో సహాయ కేంద్రంను నిర్వహిస్తుంది.
 
 కాగా ఫిజికల్లీ చాలెంజడ్, స్ఫోర్ట్సు, ఎన్‌ఎస్‌ఎస్ కేటగిరికి చెందిన విద్యార్థులు మాత్రం కౌన్సెలింగ్‌కు విశాఖపట్నంలోని ఏయూ డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. మిగతా విద్యార్థులు ఏ సహాయ కేంద్రంలోనైనా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావచ్చు. ఈ నెల 9 నుంచి 12 వరకు ఈ వెబ్ కౌన్సెలింగ్ కొనసాగనుంది. 9నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 15వ తేదీన మొదటి విడత  సీట్లు అలాట్ మెంట్ ఉంటుంది. 15 నుంచి 18 వరకు పేమెంట్ సీట్లు అలాట్‌మెంట్ అందుబాటులో ఉంచు తారు .మిగులు సీట్లకు 20, 21వ తేదీల్లో రెండో విడత  కౌన్సెలింగ్‌ను  నాలుగు సహాయ కేంద్రాల్లో నిర్వహిస్తారు. 21 నుంచి 23 మధ్య వీరు ఆష్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. వీరికి 24న సీట్ల అలాట్‌మెంట్ ఉంటుంది. 25 నుంచి 28 మధ్య పేమెంట్ సీట్ల అలాట్‌మెంట్ ఉంటుంది. జూలై రెండో వారంలో తరగతులు ప్రారంభమవుతాయి.
 
 కౌన్సిలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు
 ఈనెల తొమ్మిది నుంచి ప్రారంభించ నున్న ఆసెట్-2014 వెబ్ కౌన్సె లింగ్ సజావుగా నిర్వహనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.ఉదయం తొ మ్మిది నుంచి సహాయ కేంద్రంలో దృవీకరణ పత్రాలు పరిశీలన సాగు తుంది.దృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తయిన విద్యార్థులు వెబ్ కౌ న్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది.
 -ప్రిన్సిపాల్ గుంట తులసీరావు,
 బీఆర్‌ఏయూ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement