‘ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చే అవకాశమే లేదు’ | Peddireddy Ramachandra Reddy Deny Allegations About Grama Sachivalayam Exam | Sakshi
Sakshi News home page

ఆ వార్తలు అవాస్తవం: పెద్దిరెడ్డి

Sep 20 2019 2:29 PM | Updated on Sep 20 2019 6:40 PM

Peddireddy Ramachandra Reddy Deny Allegations About Grama Sachivalayam Exam - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న వార్తల్ని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికే కొంతమంది పనిగట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలు వాస్తవాలు కాదని ఆయన ఖండించారు. పరీక్షల నిర్వహణను అన్ని మీడియా సంస్థలు ప్రశంసించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రశ్నాప్రతాలు బయటకు వచ్చే అవకాశమే లేదన్నారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురి కావద్దన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement