తమ అభిమాన నటుడి చిత్రం 'అత్తారింటికి దారేది' విడుదల కాకముందే లీక్ అవుటంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : తమ అభిమాన నటుడి చిత్రం 'అత్తారింటికి దారేది' విడుదల కాకముందే లీక్ అవుటంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ సీడీ షాపుపై దాడి చేసి సీడీలను ధ్వంసం చేశారు. పోలీసులు కూడా ఓ సీడీ షాపుపై దాడి చేసి కంప్యూటర్లు, లాప్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుతూ తమ హీరో తాజా చిత్రం కోసం ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురు చూస్తున్నామన్నారు. పైరసీ సీడీలు విడుదలను వారు తీవ్రంగా ఖండించారు.
పవన్ కళ్యాణ్ను అణగదొక్కేందుకే కొంతమంది ప్రయత్నిస్తున్నారని...దానిలో భాగంగానే లీక్ అయిందని వారు ఆరోపించారు. పవర్ స్టార్ను ఎవరూ తొక్కలేరని అభిమానులు అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా కృష్ణాజిల్లా పెడనలో అత్తారింటికి దారేది చిత్రం రూ.50పై పైరసీ సీడీ మార్కెట్లో లభ్యమయిన విషయం తెలిసిందే.