నేడు రాష్ట్రానికి పార్లమెంటరీ బృందం | Parliamentary team to become telangana state today | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్రానికి పార్లమెంటరీ బృందం

May 26 2015 1:47 AM | Updated on Sep 3 2017 2:40 AM

ఎగుమతులకు అవసరమైన మౌలిక సౌకర్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.

సాక్షి, హైదరాబాద్: ఎగుమతులకు అవసరమైన మౌలిక సౌకర్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. 20 మంది ఎంపీల ఈ బృందం ఇప్పటికే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించింది. ఈ బృందానికి సమర్పించాల్సిన వివరాలపై పరిశ్రమల శాఖ అధికారులు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు వివరించారు. సనత్‌నగర్‌లోని ఇన్‌లాండ్ కంటెయినర్ డిపో, నాగులపల్లిలోని సీడబ్ల్యూసీ గోదాములు, కూకట్‌పల్లిలోని కంటెయినర్ రవాణా వ్యవస్థను ఈ బృందం పరిశీలిస్తుంది.

ఈ బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో బుధ వారం భేటీ అవుతుంది. రాష్ట్రానికి సముద్రమార్గం లేకపోవడంతో డ్రైపోర్టు ఏర్పాటుపై పరిశీలించాలన్న విజ్ఞప్తిని బృందం ముందు ఉంచే అవకాశముందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement