ఓటు వేయకపోతే చంపేస్తాం

Paritala Sriram Violate Election Code In Raptadu - Sakshi

సాక్షి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగిసినప్పటికీ అధికార పార్టీ అండతో టీడీపీ నేతలు బుధవారం కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌.. రామగిరి, చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. కోడ్‌ను ఉల్లంగిస్తున్నారు. శ్రీరామ్‌కు ఓటు వేయకపోతే చంపుతామని ఆయన వర్గీయులు బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీకి సహరించకపోతే అంతుచూస్తామని స్థానిక నేత ముత్యాలుపై పరిటాల అనుచరులు దాడికి దిగారు.

పరిటాల దౌర్జన్యాలపై పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సునీత వర్గీయులను చెర్లోపల్లి గ్రామస్తులు అడ్డుకుని.. పోలీసులు సమాచారం ఇచ్చినా.. అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. ఓటర్లకు బెదిరింపులు, పోలీసుల తీరును వైఎస్సార్‌సీపీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి సునీతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఓటర్లను బెదిరిస్తున్నా పరిటాల వర్గీయులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాడ్‌ చేశారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top