ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారుగా పరకాల | parakala prabhakar appoint Communication Advisor to AP Government | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారుగా పరకాల

Jul 4 2014 10:00 PM | Updated on Sep 2 2017 9:48 AM

ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారుగా పరకాల

ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారుగా పరకాల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క మ్యూనికేషన్ సలహాదారుగా డాక్టర్ పరకాల ప్రభాకర్‌ను నియమించారు.

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క మ్యూనికేషన్ సలహాదారుగా డాక్టర్ పరకాల ప్రభాకర్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభాకర్‌కు క్యాబినెట్ హోదా క ల్పించారు.

పరకాల నియామకానికి సంబంధించిన విధి విధానాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రభాకర్ గతంలో బీజేపీ, పీఆర్‌పీల్లో పనిచేశారు. ప్రస్తుతం విశాలాంధ్ర మహాసభ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం కేంద్ర వాణిజ్య మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement