మార్చి 24న ‘పంచాయతీ’ ర్యాంకింగ్ జాబితాలు | panchayat secretary ranking list on march 24th | Sakshi
Sakshi News home page

మార్చి 24న ‘పంచాయతీ’ ర్యాంకింగ్ జాబితాలు

Feb 24 2014 1:22 AM | Updated on Sep 4 2018 5:07 PM

రాష్ట్ర వ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను మార్చి 24న జిల్లా కలెక్టర్లకు పంపించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను మార్చి 24న జిల్లా కలెక్టర్లకు పంపించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. రెవెన్యూ జిల్లా యూనిట్‌గా పోస్టుల భర్తీ ఉంటుందని, 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ పాయింట్ల ద్వారా ప్రతిభాక్రమాన్ని అనుసరించి పోస్టుల ఎంపికను ఆయా జిల్లాల కలెక్టర్లు లేదా, జిల్లా ఎంపిక కమిటీ చేపడుతుందని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement