మెడికల్ సీటు వద్దంటే.. లక్ష ఫైన్! | Sakshi
Sakshi News home page

మెడికల్ సీటు వద్దంటే.. లక్ష ఫైన్!

Published Sat, Aug 30 2014 11:56 AM

మెడికల్ సీటు వద్దంటే.. లక్ష ఫైన్!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. సీటు తీసుకున్నాక దాన్ని రద్దు చేసుకుంటే లక్ష రూపాయల అపరాధ రుసుం కట్టాల్సి ఉంటుందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బుట్టా శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈ లక్ష రూపాయల నిబంధనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో కౌన్సెలింగ్లో తమ పిల్లలకు మంచి కాలేజీలో సీటు వస్తే దాన్ని మార్చుకోవడం తప్పా అని వారు వాదిస్తున్నారు. అయితే.. కావాలని సీటు రద్దు చేసుకుంటేనే ఫైన్ కట్టాల్సి ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు.. ఎంసెట్ మెడికల్ విభాగంలో 19వ ర్యాంకు వచ్చినా.. కౌన్సెలింగ్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో డీనా అనే ర్యాంకర్ను అధికారులు తిప్పిపంపారు.

మరోవైపు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీలో కూడా మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మెడికల్‌ సీట్లలో 15% ఎన్‌ఆర్‌ఐ కోటాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వీసీని కలిసి మెమోరాండం ఇచ్చేందుకు పీడీఎస్‌యూ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement