
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నెదర్లాండ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో వైఎస్ జగన్‌తో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారితో రాష్ట్రంలోని వివిధ రంగాలలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.
నెదర్లాండ్ ప్రతినిధులతో భేటీ అనంతరం సీఎం జగన్.. వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ డైరీని అవిష్కరించారు. అంతకు ముందు సీఎం జగన్‌ను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు ఉన్నారు.