నారాయణ కాలేజీ సిబ్బంది దాష్టికం | Narayana College Students Case File Against Teachers | Sakshi
Sakshi News home page

నారాయణ కాలేజీ సిబ్బంది దాష్టికం

Oct 2 2019 8:47 PM | Updated on Oct 2 2019 9:49 PM

Narayana College Students Case File Against Teachers  - Sakshi

అనంతపురం: పట్టణంలోని నారాయణ కాలేజీ సిబ్బంది విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. హాస్టల్‌లో వసతి, భోజనం సరిగా ఉండడం లేదని ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు అధ్యాపకులను నిలదీశారు. దీంతో కంగుతిన్న నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్‌ శిఖామణి, వార్డెన్‌ మహేష్‌ సీనియర్‌ విద్యార్థులతో జూనియర్‌ విద్యార్థులపై దాడి చేయించారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు పట్టణ పోలీస్‌కు చేరుకొని పోలిసులకు ఫిర్యాదు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement