'జడ్జిపై నరసాపురం ఎమ్మెల్యే దౌర్జన్యం' | Narasapuram MLA Bandaru Madhava Naidu scold Court Judge | Sakshi
Sakshi News home page

'జడ్జిపై నరసాపురం ఎమ్మెల్యే దౌర్జన్యం'

Aug 15 2014 5:34 PM | Updated on Sep 2 2017 11:55 AM

బండారు మాధవనాయుడు(ఫైల్ ఫోటో)

బండారు మాధవనాయుడు(ఫైల్ ఫోటో)

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కోర్టు ఆవరణ వద్ద అదనపు జడ్జి కల్యాణరావుతో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వాగ్వాదానికి దిగారు.

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కోర్టు ఆవరణ వద్ద అదనపు జడ్జి కల్యాణరావుతో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆవరణలో షాపులు ఖాళీచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జడ్జిపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని నరసాపురం బార్‌ అసోసియేషన్ ఆరోపించింది. ఎమ్మెల్యే రౌడీలా ప్రవర్తించారని మండిపడింది. జడ్జిని ఏకవచనంతో సంబోధించడంతోపాటు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది.

ఎమ్మెల్యే దౌర్జన్యానికి నిరసనగా బుధవారం విధులు బహిష్కరిస్తున్నామని బార్‌ అసోసియేషన్ అధ్యక్షులు పోలిశెట్టి బాబ్జి తెలిపారు. అయితే జడ్జి పట్ల తాను దురుసుగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే మాధవనాయుడు వివరణయిచ్చారు. ప్రత్యామ్నాయం చూపకుండా జడ్జి స్వయంగా షాపులు ఖాళీ చేయిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఆయన జడ్జి అని తనకు తెలియదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement