
బాపట్ల: చంద్రబాబు తనయుడు లోకేశ్ మరోసారి తన విచిత్ర వ్యాఖ్యలతో ప్రజలను, కార్యకర్తలను అయోమయానికి గురి చేశారు. ‘అమరావతిలో మేం దాడి చేస్తే పోలీసులు మా మీద కేసులెలా పెడతారు’ అంటూ వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బాపట్లలో లోకేశ్ సోమవారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బీఆర్ అంబేడ్కర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అమరావతి ఉద్యమానికి డబ్బులు అవసరం లేదని చెప్పారు.
అమరావతిలో సన్న, చిన్నకారు, దళిత అసైన్డ్ భూముల రైతుల కోసం పోరాటం చేస్తుంది తామేనన్నారు. అయితే.. అంబేడ్కర్ భవనంలో సమావేశం నిర్వహించి ఆయన సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించిన లోకేశ్ కనీసం అంబేడ్కర్ విగ్రహానికి, చిత్రపటానికి నివాళి అర్పించకపోవడం విమర్శలకు తావిచ్చింది. దళితులు లోకేశ్ తీరుపై మండిపడ్డారు.