టీడీపీకి 2019లో అగ్రిగోల్డ్‌ బాధితుల దెబ్బ..

Muppalla Nageswara Rao Says Chalo Secretariat On May 30, 31st - Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీకి 2019 ఎన్నికల్లో అగ్రిగోల్డ్‌ బాధితుల దెబ్బ తగులుతుందని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్వాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఆ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల(మే) 30, 31 తేదీల్లో అగ్రిగోల్డ్‌ బాధితుల ఆత్మఘోష పాదయాత్ర ఉంటుందని తెలిపారు. అగ్రిగోల్డ్‌ సమస్యపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం నేటికి సమావేశం కాలేదు. ఎన్నో ఆశలతో బాధితులు ఎదురుచూస్తున్నారు. కానీ అగ్రిగోల్డ్‌ సమస్యలపై పాలకుల్లో ఏ విధమైన చలనం లేదని విమర్శించారు. అందుకు నిరసనగా గుంటూరు నుంచి వెలగపూడి వరకు ‘ఛలో సెక్రటేరియట్‌’ కు పిలుపునిచ్చామన్నారు.

పోలీసులకు పని లేకుండా శాంతియుతంగా ఈ నిరసన పాదయాత్ర చేపడతాం. 20 లక్షల అగ్రిగోల్డ్‌ బాధితులపై టీడీపీ మహానాడులో తీర్మానం చేయాలని కోరారు. అంతేకాక బాధితుల ఆర్తనాదాలను గమనించి తక్షణమే రూ. 3,965 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధితులు ఆత్మహత్యలకు పాల్పడకుండా మా అసోసియేషన్‌ ఎంతో కృషి చేస్తోందని ముప్వాళ్ల నాగేశ్వరరావు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top