వైద్యుల సేవలు వెల కట్టలేనివి: అవినాష్‌రెడ్డి

MP Avinash Reddy Said Doctors Services Were Invaluable - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కరోనా వ్యాప్తి నివారణలో వైద్యుల సేవలు వెల కట్టలేనివని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం లీగల్‌ అవేర్‌నెస్‌ డవలప్‌మెంట్‌ సొసైటీ ప్రతినిధి పెనుబాల విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కడప రిమ్స్‌ ఆసుపత్రిలో వైద్యులకు, సిబ్బందికి పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్‌లు పంపిణీ చేశారు. సుమారు 11 లక్షల విలువైన సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మాజీ మేయర్‌ సురేష్‌బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ సేవాభావంతో ముందుకొచ్చి వైద్యులకు కిట్లను అందజేయడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో నూతనంగా 16 మెడికల్‌ కళాశాలల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top