పెనుకొండలో పెనువిషాదం

Mother Gave Poison Four Childrens In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కుంటుబ కలహాలతో కళావతి అనే మహిళ తన నలుగురు పిల్లలకు విషం ఇచ్చి.. తరువాత తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని గుర్తించిన స్థానికులు తల్లి కళావతి, పిల్లలు అంజలి, రమేష్, రాజశేఖర్, వైష్ణవిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. మద్యానికి బానిసైన భర్త వెంకటేష్ కుటుంబాన్ని పట్టించుకోలేదన్న మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top