ఉపాధ్యాయుని అవతారం ఎత్తిన ఎమ్మెల్యే

MLA Alajangi Jogarao Act As School Teacher On Wednesday In Parvathipuram - Sakshi

సాక్షి, పార్వతీపురం : పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు బుధవారం ఉపాధ్యాయుని అవతారం ఎత్తారు. బందలుప్పి జెడ్పీ ఉన్నత పాఠశాలను  బుధవారం సందర్శించి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. హిందీ, గణితం, సైన్సు సబ్జెక్టులపై విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం పలు ప్రశ్నలు వేసి వాటిని సోదాహరణంగా వివరించారు. ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవంతో అకట్టుకునేలా బోధన సాగించారు. కాలాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదోతరగతిలో పదికి పది మార్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top