అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

Minister Perni Nani Comments On journalists attacked by miscreants in Amaravati - Sakshi

సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే 8309887955 వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. మంత్రి పేర్ని నాని సోమవారం తాడేపల్లిలో వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రోజువారీ ఆర్టీసీ సర్వీసు ఒక్క పైసా కూడా పెంచలేదని, కేవలం స్పెషల్‌ సర్వీసుల్లో మాత్రమే 50 శాతం పెంచినట్లు తెలిపారు.

మంత్రి మాట్లాడుతూ..‘జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులు. చంద్రబాబు నాయుడు ఆర్టీసీ విలీనం అసాధ్యమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చూపించారు. ఆర్టీసీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రజా నాయకుడు జగన్‌. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దమ్మున్న ముఖ్యమంత్రి జగన్‌’ అని అన్నారు. 

జర్నలిస్ట్‌ యూనియన్లు ఏమైపోయాయి?
అలాగే జర్నలిస్టు యూనియన్లు తీరును మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు. మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే ఖండించకపోవడం సరికాదని అన్నారు. పత్రికా సమాజం, జర్నలిస్ట్‌ యూనియన్లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అక్రిడేషన్‌ కార్డుల కోసం ఎగబడే జర్నలిస్ట్‌ యూనియన్లు మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే ఏమైపోయాయని సూటిగా ప్రశ్నలు సంధించారు. దాడిలో గాయపడ్డ ఎన్టీవీ హరీష్‌, టీవీ9 దీప్తి, మహాటీవీ వసంత్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. జర్నలిస్టులను కొట్టినవారిని చంద్రబాబు, నారా లోకేష్‌ సమర్థించడం దారుణమన్నారు. కష్టం గురించి తెలిసినవాడు రైతు అని, నిజమైన రైతులు ఎవరి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయరన్నారు. రైతు ఆందోళన శాంతియుతంగా ఉంటుందని, ఆందోళన చేసినవారంతా ఎవరిచేత ప్రేరేపించబడ్డారో అందరికీ తెలుసు అని మంత్రి మండిపడ్డారు.

చదవండి

జర్నలిస్టులపై దాడి యాదృచ్ఛికం కాదు

వెంబడించి మరీ దాడి చేశారు : జర్నలిస్టులు

రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top