చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగం చేశారు.. | Minister Mopidevi Venkata Ramana Meet With YSRCP Cadre In Visakhapatnam | Sakshi
Sakshi News home page

సమ్మిట్‌ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం : మంత్రి మోపిదేవి

Jun 30 2019 4:53 PM | Updated on Aug 30 2019 8:37 PM

Minister Mopidevi Venkata Ramana Meet With YSRCP Cadre In Visakhapatnam - Sakshi

విశాఖపట్నం: విశాఖ మహానగరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని రాష్ట్ర పశుసంవర్ధకం, మత్య్స, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాల్సిన పూర్తి బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ విజయ దుందుబి మోగించానా.. చిన్న లోపాల వల్ల విశాఖపట్నం నగరంలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలను కోల్పోయామని ఆయన వెల్లడించారు. కాగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్లవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. టీడీపీ పాలనలో సమ్మిట్‌ల పేరుతో చంద్రబాబు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి కేబినెట్‌లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement