గవర్నర్ చొరవతీసుకోవాలి: మంత్రి గంటా | Minister Ganta met Governor | Sakshi
Sakshi News home page

గవర్నర్ చొరవతీసుకోవాలి: మంత్రి గంటా

Apr 30 2015 4:57 PM | Updated on Mar 28 2019 5:39 PM

మంత్రి గంటా శ్రీనివాస రావు - Sakshi

మంత్రి గంటా శ్రీనివాస రావు

ఏపీ ఎంసెట్ విషయమై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలిశారు.

హైదరాబాద్: ఏపీ ఎంసెట్ విషయమై  ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలిశారు. హైదరాబాద్లో ఏపీ ఎంసెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కోరారు. గవర్నర్ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ  పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, ట్రాఫిక్ సమస్యలను తెలంగాణ పోలీసులు నిర్వహించాలని అన్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, తెలంగాణ డీజీపీకి తెలియజేశామని చెప్పారు. ఏపీ ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత రావాలన్నారు. విద్యార్థుల విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు మంత్రి గంటా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement