వివాహిత ఆత్మహత్య | married woman commits suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Oct 31 2015 3:42 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం వెంకటాపురంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(30)కి పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కృష్ణతో వివాహమైంది.

ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య గొడవలు పెరగడంతో కుటుంబ కలహాలు ఎక్కువై మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement