విశాఖ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. జి.మాడుగుల మండలం సందులొవ గ్రామానికి చెందిన కె.కొండబాబు, మాకవరంపాలెం మండలం సీతానగరం గ్రామానికి చెందిన నమ్మి రమణ అనే ఇద్దరు గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు.
విశాఖ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. జి.మాడుగుల మండలం సందులొవ గ్రామానికి చెందిన కె.కొండబాబు, మాకవరంపాలెం మండలం సీతానగరం గ్రామానికి చెందిన నమ్మి రమణ అనే ఇద్దరు గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. సోమవారం మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయం జంక్షన్ వద్ద చేపట్టిన తనిఖీల్లో వీరి వద్ద 20 కిలోల గంజాయి లభించింది. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, గంజాయితోపాటు బైక్‌ను సీజ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.