వనదేవతల జాతర ఆరంభమైంది. భక్తుల పూనకాలు, ఒగ్గుడోలు నృత్యాల మధ్య కుంకుమభరిణె రూపంలో ఉన్న సారలమ్మను కోయపూజారులు గద్దెపైకి తీసుకురావడంతో జాతరలో తొలిఘట్టం మొదలైంది.
వనదేవతల జాతర ఆరంభమైంది. భక్తుల పూనకాలు, ఒగ్గుడోలు నృత్యాల మధ్య కుంకుమభరిణె రూపంలో ఉన్న సారలమ్మను కోయపూజారులు గద్దెపైకి తీసుకురావడంతో జాతరలో తొలిఘట్టం మొదలైంది. బంగారం మొక్కుల చెల్లింపు, ఒడిబియ్యం సమర్పణతో జాతర ప్రాంగణాలు కిటకిటలాడాయి. జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. గురువారం సమ్మక్క భక్తులకు దర్శనమివ్వనుంది.