అధికారులు వేధిస్తున్నారని టవరెక్కాడు | man protest against officers harassment | Sakshi
Sakshi News home page

అధికారులు వేధిస్తున్నారని టవరెక్కాడు

Aug 27 2015 11:33 AM | Updated on Sep 3 2017 8:14 AM

చిత్తూరు జిల్లాలో అధికారులు వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు.

కాణిపాకం: చిత్తూరు జిల్లాలో అధికారులు వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. జిల్లాలోని ఐరాల మండలం నాంపల్లి గ్రామానికి చెందిన కామేశ్వర నాయుడుకు చెందిన స్థలం వివాదంలో ఉంది. పరిష్కారానికి పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగాడు. కానీ,వారు లంచం డిమాండ్ చేస్తుండటంతో విసిగిపోయిన కామేశ్వరనాయుడు గురువారం ఉదయం 8.30 గంటలకు గ్రామంలోని టవరెక్కాడు. తన సమస్యను పరిష్కరిస్తేనే కిందికి దిగుతానని భీష్మించాడు. దీంతో గ్రామస్తులు అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement