వాగులో మునిగి యువకుడి మృతి | man dies of wagu in nalgonda district | Sakshi
Sakshi News home page

వాగులో మునిగి యువకుడి మృతి

Aug 2 2015 4:37 PM | Updated on Apr 3 2019 8:07 PM

నల్గొండ జిల్లా మేళ్లచెరువు వద్ద గల పులిచింతల వాగులో ఈతకు వెళ్లి ఒక యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు.

మేళ్లచెరువు: నల్గొండ జిల్లా మేళ్లచెరువు వద్ద గల పులిచింతల వాగులో ఈతకు వెళ్లి ఒక యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. కృష్ణా జిల్లా చిల్లకల్లుకు చెందిన ఖాదర్ (30) అత్తగారి ఊరైన నల్గొండ జిల్లా మల్లారెడ్డిగూడెంకు వచ్చాడు.

స్నేహితుల దినోత్సవం సందర్భంగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈతకొట్టేందుకు పులిచింతల వాగుకు వెళ్లారు. వాగులో ఈతకొడుతుండగా ప్రమాదవశాత్తూ ఖాదర్ నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement