మద్యానికి డబ్బులివ్వలేదని ఆత్మహత్య | man commits suicide in krishna district | Sakshi
Sakshi News home page

మద్యానికి డబ్బులివ్వలేదని ఆత్మహత్య

Jan 30 2016 11:20 AM | Updated on Nov 6 2018 7:56 PM

మద్యానికి భార్య డబ్బులివ్వలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణం చెందాడు.

నందిగామ: మద్యానికి భార్య డబ్బులివ్వలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణం చెందాడు.కృష్ణా జిల్లా నందిగామలోని రమణ కాలనీలో శనివారం ఉదయం చోటు చేసుకుంది ఈ ఘటన. వేముల రవికుమార్(40), వెంకటనర్సమ్మ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి రెండు నెలల క్రితం గుంటూరు నుంచి వలస వచ్చారు.

రవి కుమార్ తాపీ పని, వెంకటనర్సమ్మ కూలి పనులు చేస్తుంటారు. మద్యానికి బానిసైన రవి కుమార్ శుక్రవారం రాత్రి భార్యను మద్యం కోసం డబ్బులు అడగ్గా తన వద్ద లేవని ఆమె బదులిచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన రవికుమార్ మద్యం తాగి అర్థరాత్రి సమయంలో వచ్చి గొడవపడ్డాడు. శనివారం ఉదయం వెంకటనర్సమ్మ నిద్ర లేచి చూసేసరికి ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement