కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఎన్‌ఎస్‌ఆర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగింది.
కోవూరు (నెల్లూరు) : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఎన్‌ఎస్‌ఆర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కాలనీకి చెందిన కొత్తూరు నరేంద్ర(39) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా గత కొన్నిరోజులుగా కుటుంబ కలహాలు ఎక్కువవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.