చేతబడి నెపంతో వ్యక్తి దారుణహత్య | Man brutally murdered | Sakshi
Sakshi News home page

చేతబడి నెపంతో వ్యక్తి దారుణహత్య

Nov 10 2015 3:47 PM | Updated on Sep 3 2017 12:20 PM

డుంబ్రిగూడ మండలం గుంటిసీమ పంచాయతీ సోబూరు గ్రామంలో సాగి కొండ(50) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.

డుంబ్రిగూడ (విశాఖపట్నం జిల్లా) : డుంబ్రిగూడ మండలం గుంటిసీమ పంచాయతీ సోబూరు గ్రామంలో సాగి కొండ(50) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. చేతబడి నెపంతో గ్రామస్తులు కొట్టి చంపి బూడిద చేశారు.  ఈ దారుణం గత నెల 14 న జరిగినా ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించటంతో భార్యా,పిల్లలు భయపడి చెప్పలేదు. మంగళవారం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement